నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని జాఫర్ సాహెబ్ కెనాల్, సర్వేపల్లి కెనాల్ వద్ద పనులు అసంపూర్తిగా జరగడంతో పాటు రివీట్ మెంట్ గోడ ఎత్తు తక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.