రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా యాదవ కులస్తులు మరింత ఎదగాలని మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరు నగరంలోని యాదవ భవన్ లో కార్తీకమాసం సందర్భంగా యాదవుల కార్తీక వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదవులు అభ్యున్నతికి తాము ఇప్పుడు కట్టుబడి ఉన్నామని చెప్పారు. రూప్ కుమార్, భరత్ కుమార్, బొమ్మి నాగ కిషోర్, నాగేంద్ర పాల్గొన్నారు.