బస్సు బోల్తా.. కాంతార చిత్ర యూనిట్కు గాయాలు

73చూసినవారు
బస్సు బోల్తా.. కాంతార చిత్ర యూనిట్కు గాయాలు
కాంతార చాప్టర్-1 మూవీలో నటిస్తున్న ఆర్టిస్టుల బస్సు తాజాగా ప్రమాదానికి గురైంది. కర్ణాటక ఉడిపి జిల్లా జడ్కల్‌ సమీపంలో బోల్తా పడిన బస్సులో 20 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ముదూరులో షూటింగ్ ముగించుకుని కొల్లూరుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్