డిఆర్డిఏ నూతన ప్రాజెక్టు డైరెక్టర్ గా నాగరాజ కుమారిని నియమించారు. ఈ మేరకు ఆమె నెల్లూరు కార్యాలయంలో శనివారం బాధ్యతలు చేపట్టారు. నూతన పిడికి డిఆర్డిఏ కార్యాలయ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా బాద్యతలు చేపట్టిన ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హత కలిగిన అందరికి అందేలా చూస్తామని తెలిపారు.