మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజ గోపాల్ రెడ్డి తదితరులు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి పలు అంశాలను చర్చించారు.