వైభవంగా హనుమజ్జయంతి వారోత్సవ వేడుకలు
పొదలకూరులో మంగళవారం హనుమజ్జయంతి అనంతర ఉత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. పొదలకూరు పట్టణం లోని మారుతీ నగర్ లో వెలసి ఉన్న ఆంజనేయ స్వామికి మంగళవారం అభిషేకం, ఆకు పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. హనుమజ్జయంతి అనంతరం వరుసగా 16 మంగళవారాలు ఉత్సవాలు నిర్వహించడం గత దశాబ్ద కాలంగా ఆనవాయితీగా వస్తోంది.