విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎంపీడీవో
సీతారాంపురం నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్ సీతారాంపురం మండలంలోని బసినేనిపల్లి సచివాలయాన్ని శుక్రవారం సందర్శించారు. సచివాలయంలోని రికార్డులు పరిశీలించారు. సచివాలయం సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని యూనిఫామ్ ధరించాలని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సచివాలయంలోని సిబ్బంది మొత్తం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు.