సీతారాంపురంలో 8 కాళ్లు, 2 తలలతో విచిత్ర మేకపిల్ల జననం
నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం పోలంగారి పల్లి గ్రామంలో వింత మేకపిల్ల జన్మించింది. గ్రామానికి చెందిన కటారి వెంకటయ్యకు ఉన్న మేకల్లో బుధవారం ఒక మేక ఎనిమిది కాళ్లు, రెండు తలలు, నాలుగు చెవులతో ఉన్న పిల్లకు జననం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు ఆ మేకను చూడడానికి తరలివచ్చారు. వెంకటయ్య పశువైద్యాధికారులను సంప్రదించడంతో జన్యు లోపంతో కొన్నిసార్లు ఇలా జరుగుతుందని తెలిపారు.