సరైన పత్రాలు ఉంటేనే రోడ్డుపైకి రండీ

2554చూసినవారు
సరైన పత్రాలు ఉంటేనే రోడ్డుపైకి రండీ
పెళ్లకూరు మండలం పరిధిలోని బండ్ల మాంబ దేవాలయం వద్ద పెళ్లకూరు సబ్ ఇన్స్పెక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా లైసెన్స్ మరియు ఇతర ధృవీకరణ పత్రాలు లేకుండా వాహనాలను నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పలు వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడంతో వాహనాలను సీజ్ చేశామని ఆమె పేర్కొన్నారు. అక్రమ రవాణా వంటి నేరాలను అరికట్టడానికి ఈ తనిఖీలు చేపట్టినట్లు సబ్ ఇన్స్పెక్టర్ సౌమ్య పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలపై బయటకు వచ్చే వాహనచోదకులు వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎల్లప్పుడూ కలిగి ఉండాలని అన్నారు. రహదారుల వెంట ఉన్న స్పీడో బోర్డు ను అనుసరించి వాహనాలను నడపాలని సూచించారు. నాయుడుపేట శ్రీకాళహస్తి వెంబడి ఉన్న రహదారి మండలం పరిధిలో ఉన్నందున రోజు ఎక్కడో ఒక దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయని... వాహనదారులు గాయపడడం ప్రాణాలు పోగొట్టుకోవడం వంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్