సూళ్లూరుపేట పట్టణానికి చెందిన ఎద్దల రాజాయశ్వంత్ రెడ్డి అనే బాలుడు ఇంటి నుంచి నెట్ షాప్ కు వెళ్లి వస్తానని చెప్పి అదృశ్యమైన సంఘటన విధితమే. ఈ మేరకు బాలుడు తల్లి రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు మూడు బృందాలుగా పోలీసులు విడిపోయి రాజాయశ్వంత్ రెడ్డి కోసం గాలింపు వేగవంతంగా చేపట్టారు.
ఈ క్రమంలో సూళ్లూరుపేట పట్టణంలోని ఓ జెరాక్స్ దుకాణం యజమాని వద్ద రాజాయశ్వంత్ రెడ్డి తన వద్ద ఉన్న ఫోన్ ను ఇచ్చి నగదు ఇవ్వాలని కోరినట్లు సమాచారం రావడంతో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. బాలుడు వద్ద ఉన్న సెల్ఫోన్ ఆధారంగా గాలింపు చర్యలు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు అన్ని కోణాల్లో బాలుడిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు.