ముగిసిన గరిమెళ్ల బాలకృష్ణ అంత్యక్రియలు

65చూసినవారు
ముగిసిన గరిమెళ్ల బాలకృష్ణ అంత్యక్రియలు
AP: టీటీడీ ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఏపీ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు పూర్తిచేశారు. మంగళవారం ఉదయం తిరుపతి భవానీనగర్‌లో గరిమెళ్ల నివాసం నుంచి అంతిమయాత్ర నిర్వహించారు.  గరిమెళ్లకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు చేరుకున్నారు. అనంతరం హరిశ్చంద్ర శ్మశాన వాటికలో గరిమెళ్ల అంత్యక్రియలు నిర్వహించారు. గరిమెళ్ల గుండెపోటుతో ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్