ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపు మేరకు అమెరికాలోని ర్యాలై, నార్త్ కరోలినా ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు విమల్ కుమార్ కొలప్ప, సాయి కిరణ్ కొలవెన్ను, పెట్టుబడులు పెట్టేందుకు ఎమ్మెల్యేతో కలిసి కొండాపురం, కలిగిరి మండలాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. వ్యవసాయానికి అనుకూలమైన ఈ ప్రాంతంలో ఆగ్రో ఫామ్స్ ఏర్పాటు చేసేందుకై కొండాపురం మండలం చింతల దేవిలోని కామధేను ప్రాజెక్టును పరిశీలించారు.