3వ రోజు అగ్ని ప్రమాదాలపై మహిళలకు అవగాహన

1056చూసినవారు
3వ రోజు అగ్ని ప్రమాదాలపై మహిళలకు అవగాహన
ఇండ్లల్లో జరుగు అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక అధికారి చంద్రమౌళి మహిళలకు అవగాహన కల్పించారు. ఆదివారం స్థానిక బీసీ కాలనీలో మూడవరోజు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వంట గ్యాస్ పై మహిళలు భయాందోళన చెందొద్దని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు పై అవగాహన కలిగి ప్రమాదాలను నిర్మూలన చేయొచ్చు అన్నారు. అనంతరం తమ సిబ్బందితో గ్యాస్ లీకేజీ అగ్ని ప్రమాదాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు చేపట్టవలసిన చర్యలను డెమో రూపంలో మహిళలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సిబ్బందికి తెలియపరచాలని అందుకు 101 లేదా 108 కు ఫోన్ చేసి సమాచారం తెలపాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :