దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు గ్రామంలో పాలు కల్తీకి గురవతున్నట్లు గ్రామస్తుడు అడ్వకేట్ మహేంద్రబాబు మోడీ తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ శాతం పెరుగుదలకు నూనె మరియు ఇతర సామాగ్రిలను కలిపి పాలను కల్తీ చేస్తున్నట్లు ఆరోపించారు. గతంలో ఈ అంశం మీద గ్రామంలో అవగాహన ర్యాలితో పాటు, ప్రజలతో నిర్వహించిన సభాస్థలిలో మాట్లాడామని తెలియజేశారు. అయినా పాడిరైతులలో మార్పులేకపోవడం బాధాకరమన్నారు.