నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలంలోని నందిపాడు గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, నందిపాడు సెంటర్ నందు తూర్పు రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి పెర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి మద్దతుగా ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశానుసారం మంగళవారం గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో నందిపాడు మాజీ సర్పంచ్ మరియు మాజీ సొసైటీ చైర్మన్ మండ్ల శ్రీనివాసులు (శివ) నందిపాడు ఎంపీటీసీ సభ్యురాలు కోసినపోగు ఎస్తేరమ్మ, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్‌డి మౌలాలి, సచివాలయ కన్వీనర్లు నల్లబోతుల వెంకటేశ్వర్లు, లక్ష్మి కుమారి, వైఎస్ఆర్సిపి నాయకులు నల్లబోతుల అశోక్, కొండ శ్రీనివాసులు రామయ్య, ఎడమ కంటి వెంకటరత్నం , తదితరులు పాల్గొన్నారు.