జలదంకి మండలంలోని రైతులు సాగునీరు కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమశిల మేజర్ కెనాల్ ద్వారా సరఫరా కాలువలో పూడిక ఎక్కువ కావడంతో నీరు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి జలదంకిలో మాట్లాడుతూ సోమవరప్పాడు మేజర్ కెనాల్ కాలువలో కూడికతీత వలన తదితర ప్రాంతాల్లోని గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందని తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం పూడిక తీత పనులు ప్రారంభించారు.