హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన , బీజేపీ పార్టీలు, విశ్వహిందూ పరిరక్షణ పరిషత్ సంయుక్తంగా ధర్మ పరిరక్షణ ర్యాలీ పిలుపునిచ్చిన సందర్భంగా సీతారామపురం మండలంలోని బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని ఇచ్చారు. బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి, జనసేన నియోజకవర్గ నాయకులు ఆల్లూరి రవీంద్ర మాట్లాడుతూ... భారత దేశం లౌకికవాద దేశమని, ఇక్కడ అన్ని మతాలకు, వారి ఆచారాలకు సమాన గౌరవం ఉంటుందని, ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పరిస్తితి లేదని హిందూ దేవాలయాలపై కుట్రపూరితంగా దాడులు జరుగుతున్నాయని పిట్టాపురం,కొండ బిట్రగుంట, అంతర్వేది ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.