కొండాపురం: ఉదృతంగా ప్రవహిస్తున్న మిడత వాగు

57చూసినవారు
కొండాపురం: ఉదృతంగా ప్రవహిస్తున్న మిడత వాగు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం లో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కొండాపురం మండలం, సత్యవోలు అగ్రారం మిడత వాగు లో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలకి అంతరాయం కలగడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలు గ్రామాల్లో వరద నీరు చెరువును తలపిస్తూ ప్రవహిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్, పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్