జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నెల్లూరు జిల్లాలో నాలుగు, ఐదు తేదిల్లో పర్యటించబోతున్నారని జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ నాయకులు ఆల్లూరి రవీంద్ర తెలియజేశారు. వారు మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకొనున్నారని అందువలన ఉదయగిరి నియోజకవర్గంలోని జనసైనికులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు తెలిపారు. అదేవిధంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో నివర్ తుఫాన్ కారణంగా వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని, మేకలు గొర్రెలు వందల సంఖ్యలో చనిపోవడం జరిగిందని ప్రభుత్వం స్పందించి రైతులకు వెంటనే సాయం చేయాల్సిందిగా జనసేన పార్టీ తరపున వారు ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీతారామపురం మండల నాయకులు పాలిశెట్టి శ్రీనివాసులు, గుంటూరు సుభాని, మందపాటి రమేష్, శ్రీకాంత్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు