ఏపీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 117 గురించి శుక్రవారం మాట్లాడారు. నారా లోకేష్ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంపై వ్యతిరేక గలమును వినిపించి, వారి హక్కుల కోసం పోరాడి, ప్రభుత్వ మార్పునకు నాంది పలికినది ఉపాధ్యాయులేనని, వారికి ఈ ప్రభుత్వం సముచిత స్థానమును కల్పిస్తుందని, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి జీవో 117 కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని తెలిపారు.