రెడ్డిగూడెం లో వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

72చూసినవారు
పేదలు ఆనందంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. తిరుపతి రావు అన్నారు. శనివారం రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు బలపరచాలన్నారు. తీన్మార్ డప్పు వాయిద్యాలతో వైసిపి పార్టీ శ్రేణులు తిరుపతిరావుకు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్