గంపలగూడెం మండలం పెనుగొలను 99వ అంగన్వాడీ కేంద్రంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను విశ్రాంత ఎంఈఓ. వి. శేషి రెడ్డి ఎగురవేశారు. అంగన్వాడి టీచర్ కె. లింగమ్మ గాంధీ, నెహ్రూ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కాన్మెంటు కరస్పాండెంట్ వెదురు వెంకటరెడ్డి, సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.