పలగూడెం మండలం పెనుగొలను బోటి మీద వేంచేసి యున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో మూడు రోజుల నుంచి జరుగుతున్న ఉగాది ఉత్సవాలు బుధవారం రాత్రి వైభవంగా ముగిశాయి. బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో భక్తులచే వైభవంగా దీపోత్స కార్యక్రమం నిర్వహించి స్వామివారికి మహా హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఉత్సవాల్లో మహిళా బృందం ప్రదర్శించిన కోలాటం పలువురిని ఆకట్టుకుంది.