ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన సరస్వతి దేవి

79చూసినవారు
ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన సరస్వతి దేవి
పిడుగురాళ్ల పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో గల నాగుల గుడి దేవాలయంలో వసంత నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు బుధవారం సరస్వతి దేవి అమ్మవారిని ప్రత్యేక గాజులతో అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు. అమ్మవారికి మహిళలు కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తి గేయాలను ఆలపించారు. సరస్వతి దేవి అమ్మవారిని తొమ్మిది రోజులు పాటు వివిధ రకాల అలంకరణలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ తెలిపింది.

సంబంధిత పోస్ట్