పిడుగురాళ్లలో రోడ్డు ప్రమాదం.. మృతదేహాలు మార్చురీకి తరలింపు
పిడుగురాళ్ల సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ, మాలధారన చేపట్టిన ముగ్గురు మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతిచెందిన వారు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన వనిత, సురేశ్, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. వీరి మృతదేహాలను పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.