సైకిల్ గుర్తు పై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి : యరపతినేని

19099చూసినవారు
సైకిల్ గుర్తు పై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలి : యరపతినేని
మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో గురజాల నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మొదటగా మోర్జంపాడు గ్రామం నందు మహిళలు హరతులతో, నాయకులు, కార్యకర్తలు, యువత భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీతో యరపతినేని కి ఘన స్వాగతం పలికారు.

అనంతరం యరపతినేని గ్రామంలో కొలువైయున్న గంగమ్మ దేవస్థానం నందు పూజలు నిర్వహించి వేచివున్న ప్రజలకు అభివాదం చేస్తూ ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గురజాల నియోజకవర్గ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిగా యరపతినేని ని, నరసరావుపేట ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ని గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల ప్రచారంలో "సైకిల్ గుర్తుపై" ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ప్రజలందరిని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు జంగా వెంకట కోటయ్య, సీనియర్ నాయకులు డా. వున్నం నాగ మల్లేశ్వరరావు, టిడిపి మండల పార్టీ కన్వీనర్ బడిగుంచల వెంకటేశ్వర్లు, జనసేన మండల పార్టీ కన్వీనర్ బొమ్మ శ్రీనివాసరావు మరియు మోర్జంపాడు గ్రామంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాచవరం మండలంలోని వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్