హత్య కేసులో నిందితుడి అరెస్ట్

53చూసినవారు
మాచర్ల మండలంలోని మిట్టమీదపల్లె శివారులో ఈనెల 4న జరిగిన చిన్న వెంకటరెడ్డి(66) హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు శనివారం గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆర్థిక లావాదేవీల కారణంగా జింకల పోల్ రెడ్డి అనే వ్యక్తి వెంకటరెడ్డిని హత్య చేశాడని చెప్పారు. సిరిగిరిపాడు చెక్ పోస్ట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచనున్నట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు.

సంబంధిత పోస్ట్