రెంటచింతల: పులి సంచారం అవాస్తవం: బీట్ ఆఫీసర్ సత్యనారాయణ
రెంటచింతల మండలం తుమ్మకోట అడవిలో పులి సంచరిస్తుందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సత్యనారాయణ సోమవారం తెలిపారు. బాలునాయక్, హుస్సేన్ పశువులు మేపేందుకు అడవిలోకి వెళ్లగా ఆవుదూడను పులి చంపిందని వారిద్దరు స్థానికులకు తెలిపారు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా పులి జాడ లేమి కనిపించలేదు ఆవుదూడ కూడా ప్రాణాలతోనే ఉందని తెలియజేయడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.