ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి

56చూసినవారు
ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్.. యువకుడు మృతి
మాచర్ల మండలం కొత్తపల్లి జంక్షన్ వద్ద ఉన్న ఎంఎస్ఆర్ టౌన్షిప్ వద్ద సోమవారం ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనుక నుంచి పల్సర్ బైక్ ఢీ కొట్టింది. దాంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న నీలమ శివ(35) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు ఒంగోలుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. హైదరాబాద్లో బేల్దారు మేస్త్రిగా పనిచేస్తూ ఈరోజు తన స్వగ్రామమైన ఒంగోలుకు వస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది.

ట్యాగ్స్ :