మంగళగిరి మహిళకు టీటీడీలో కీలక పదవి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి 24 మంది సభ్యులతో ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బుధవారం మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చేనేత కుటుంబానికి చెందిన తమ్మిశెట్టి జానకి దేవికి చోటు చిక్కింది. ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించారు.