ఎగువ నుంచి వరద నీరు రావడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం సాయంత్రం తాడేపల్లి ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జేఈ రాజేశ్ మాట్లాడుతూ ఎగువ పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 2, 28, 532 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కు వచ్చి చేరిందన్నారు. బ్యారేజ్ రిజర్వాయర్లో 70 గేట్లు ఐదు అడుగులు ఎత్తి దిగువకు 2, 20, 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు.