ఒడిశా రాజధాని భువనేశ్వర్లో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రద్యుమ్న కుమార్ (24) అనే వ్యక్తి ఓ ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా పని చేస్తున్నాడు. అతనికి అక్కడ ఇద్దరు ప్రియురాళ్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రద్యుమ్న కుమార్ కు భార్య అడ్డు వస్తుందని.. ప్రియురాళ్లతో కలిసి భార్యకు బలవంతంగా మత్తుమందు ఇచ్చి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.