
మంగళగిరి: కుంభమేళాకు వెళ్లనున్న మంత్రి లోకేశ్
మంత్రి లోకేశ్ ప్రయాగరాజ్ వెళ్లనున్నారని ఆయన కార్యాలయ సిబ్బంది బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17వ తేదీ సోమవారం ఉదయం ప్రయాగ రాజ్ చేరుకొని అక్కడ కుటుంబ సమేతంగా మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని, అక్కడి నుంచి సాయంత్రం 3. 30 గంటలకు వారణాసి చేరుకొని కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని తెలిపారు.