పెదకూరపాడు ఉద్యానవన శాఖ అధికారిగా నిత్యశ్రీ

54చూసినవారు
పెదకూరపాడు ఉద్యానవన శాఖ అధికారిగా నిత్యశ్రీ
పెదకూరపాడు జోన్ ఉద్యానవన శాఖ అధికారిగా నిత్యశ్రీ శనివారం బాధ్యతలు చేపట్టారు. గత ఆరు నెలల నుంచి ఇంచార్జి ఉద్యానవన శాఖ అధికారిగా చిలకలూరిపేటకు చెందిన కిరణ్ కుమార్ పనిచేశారు. రెగ్యులర్ ఉద్యానవన శాఖ అధికారిగా నిత్యశ్రీ విధుల్లో చేరారు. నిత్యశ్రీ ఇప్పటివరకు సెలవులో ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యానవన రైతులకు అందుబాటులో ఉంటామన్నారు. పంట పై వచ్చు చీడపీడల గురించి తగు సలహాలు ఇస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్