
పెదకూరపాడు: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చాలని మండల విద్యాశాఖ అధికారి తాడిశెట్టి సత్యనారాయణ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సోమవారం పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆరవ తరగతిలో చేరాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో వసతులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ధనలక్ష్మి, ఎండిఓ సోమయాజులు, సిబ్బంది పాల్గొన్నారు.