తెర్లాం పోలీస్ స్టేషన్లో శుక్రవారం బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు వార్షిక తనిఖీలలో భాగంగా రికార్డులు కార్డులు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషను చుట్టూ పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల ప్రకారం గంజాయి పై ఉక్కు పాదం మోపుతున్నామని యువత జీవితాలు నాశనం అవుతున్నాయని యువత గంజాయి పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు.