బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని కోరాడ వీధిలో గల మసీద్ దగ్గర కల్వర్టు పాడవడంతో ఆ వీధి వారు, చిన్నపిల్లలు, వాహనదారులు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను బొబ్బిలి మాజీ సైనిక సంఘం అధ్యక్షుడు రేవళ్ళ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లి మరమ్మత్తులు చేపట్టాలని విన్నవించారు. స్పందించిన కమిషనర్ ఎల్ రామలక్ష్మి తక్షణమే ఆ పనులను చేపట్టడంతో సమస్యకు పరిష్కారం లభించింది.