చీపురుపల్లి మండలంలో ఆంజనేయపురం కాలనీలో స్థానికంగా ఉన్న విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో బుధవారం చీపురుపల్లి అగ్నిమాపక శాఖ అధికారి డి హేమ సుందరరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక శాఖ బృందం పాఠశాలకు చేరుకొని ఆకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రిన్సిపాల్ పతివాడ జ్యోతి మరియు పాఠశాల సిబ్బంది,అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.