వయోజనుల బీసీజి టీకా కార్యక్రమం శత శాతం జరగాలని రాష్ట్ర అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ ఆదేశించారు. గురువారం విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొట్లాం హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా వేయించుకున్న వయోజనలను మూడు నెలలకు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా సూపర్ వైజర్ రాము, హెల్త్ అసిస్టెంట్ బి. విశ్వేశ్వరరావు, ఎంఎల్ హెచ్ పి వసంత లక్ష్మి పాల్గొన్నారు.