గజపతినగరం మండలం పాత బగ్గాం గ్రామంలో నూతనంగా నిర్మించిన వెల్ నెస్ సెంటర్ భవనాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. వెల్ నెస్ సెంటర్ ద్వారా సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.