గరుగుబిల్లి మండలంలోని పెదగుడబలో మైనింగు నిర్వహిస్తున్న ప్రాంతంలో అక్రమాలు జరుగుతున్నట్లు జనసేన నాయకులు ఆరోపించారు. తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు. లోపాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిస్తామని జనసేన రాష్ట్ర కార్యదర్శి పి. బాబు, కార్యదర్శులు ఉపేంద్ర తెలిపారు. కూటమి నాయకులు ఎ. మధుసూదనరావు, ఎం. తవిటినాయుడు, ఎం. కృష్ణమూర్తినాయుడు, రంజిత్ కుమార్, పాపినాయుడు ఉన్నారు.