ఏకలవ్య పాఠశాల నిర్మాణ పనులను త్వరత గతిన చేపట్టాలి

73చూసినవారు
ఏకలవ్య పాఠశాల నిర్మాణ పనులను త్వరత గతిన చేపట్టాలి
పాలకొండ నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి బుధవారం భామిని మండల హెడ్ క్వార్టర్ లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి, నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రహరీ మరియు రోడ్డు పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్