పార్వతీపురం పట్టణ పరిసరాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. దీనికి గొడవలు కారణం కాదు. ఏనుగుల బెడద నుంచి ప్రజలను రక్షించడానికి అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. నాలుగు ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి పంటలను, ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నుండి అక్కడ పోలీసులు, అటవీశాఖ అధికారులు 144 సెక్షన్ విధించి ఆంక్షలు అమలు చేస్తున్నారు.