తుఫాన్ వర్షాలకు ఎగువ ప్రాంతాల్లో పడిన వర్షాలకు మడ్డువలస ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో.. నాగావళి నది ఉదృతి పెరగింది. దీతో గిరిజన గ్రామంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. నాగావళి వరద ఉధృతి పెరిగితే పునరావాస కేంద్రానికి వెళ్లాలని తహసిల్దార్ డి. ఎల్లారావు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో వరదలు రావడం పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో విఆర్వో వీఆర్ఏలను స్థానికంగా ఉంచమన్నారు. వరదలు ఉత్పన్నమైతే తహసిల్దార్ కార్యాలయానికి సమాచారం అందించాలని కోరారు. మరి ముఖ్యంగా బొడ్డవలస గ్రామం వద్ద నాగావళి వరదకట్టు పూర్తిగా లేకపోవడంతో ఆ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.