మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్..?

596చూసినవారు
మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్..?
మచిలీపట్నం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలనుకున్న వల్లభనేని బాలశౌరిని అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ జనసేన తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :