పీవోకే విదేశీ భూభాగం.. అంగీకరించిన పాకిస్థాన్

65చూసినవారు
పీవోకే విదేశీ భూభాగం.. అంగీకరించిన పాకిస్థాన్
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) విదేశీ భూభాగమని పాకిస్థాన్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌ హై కోర్టులో అంగీకరించింది. అక్కడ పాకిస్థాన్‌ చట్టాలు చెల్లబోవని చెప్పింది. పాత్రికేయుడు అహ్మద్‌ ఫర్హద్‌ కిడ్నాప్‌ కేసుపై శుక్రవారం విచారణ సందర్భంగా పాకిస్థాన్‌ అదనపు అటార్నీ జనరల్‌ ఇస్లామాబాద్‌ కోర్టులో ఈమేరకు వ్యాఖ్యానించారు. పీవోకే విదేశీ భూభాగమని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు ఉంటాయని, పాకిస్థాన్‌ చట్టాలు చెల్లబోవని చెప్పారు.

సంబంధిత పోస్ట్