ఏపీ హోం శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. శాంతి భద్రతలపై సీఎం, తాను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని తెలిపారు. ఆ చర్చల్లో పవన్ కళ్యాణ్ కూడా భాగమేనని అన్నారు. 'ఆయనకు అన్ని విషయాలు తెలుసు.. ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు' అని ఓ ప్రముఖ ఛానెల్‌తో ఆమె చెప్పారు.