రిలయన్స్ శుక్రవారం జియో ఫైనాన్స్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మై జియో యాప్‌లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇందులో మ్యూచువల్ ఫండ్లపై లోన్లు, ఇంటి రుణాలు, యూపీఐ పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్, క్రెడిట్ కార్డు బిల్లు పేమెంట్స్, మదుపు చేసుకునే సదుపాయాలు కల్పించారు.