ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి విమానంలో రాజమండ్రి చేరుకోనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ద్వారకా తిరుమల పరిధిలోని జగన్నాధపురం చేరుకుని.. అక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గ్రామంలోని కొండపై ఉన్న నరసింహ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.