‘చెత్త’ పన్ను నుంచి ప్రజలకు విముక్తి

68చూసినవారు
‘చెత్త’ పన్ను నుంచి ప్రజలకు విముక్తి
AP: నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించింది. 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ తీసుకొచ్చిన చట్టాలను తొలగిస్తున్నట్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, 2021 నవంబర్‌లో గత వైసీపీ ప్రభుత్వం 40 పుర, నగరపాలక సంస్థల్లో ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్